కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్ ను ఎదుర్కోగలం: నాగబాబు

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కార్యకర్తలతో ముఖాముఖి

తిరుపతి మరియు శ్రీకాళహస్తి నాయకులతో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ టిడిపి నాయకులను, కార్యకర్తలను అధ్యక్షులు వారు చెప్పినట్టు గౌరవించడం మన బాధ్యత. రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వం. పది సంవత్సరాలు వేచి ఉన్న కార్యకర్తలు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి మీకు మంచి భవిష్యత్తు మునుముందు రానుంది అని గుర్తుపెట్టుకోండి. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి.. ధర్మో రక్షిత రక్షితః పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే.. ధనమో రక్షిత రక్షితః జగన్ సిద్ధాంతం. వ్యవస్థలను పోలీసు అధికారులను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాం వారు పద్ధతులను మార్చుకోకపోతే రాబోయే రోజులలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాష్ట్రంలో భూకబ్జాలు రౌడీయిజ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. మరొకసారి జగన్ ప్రభుత్వం వస్తే మన ఇంటి పత్రాలను కూడా జగన్ తాకట్టు పెట్టుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడదాం జనసేన టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా మనందరం కట్టుబడి ఉండాలి.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి శ్రీకాళహస్తి ఇన్చార్జి వినీతకోట, రీజినల్ కో ఆర్డినేటర్ వనజ, కీర్తన మరియు రాష్ట్ర జిల్లా పట్టణ కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.