జనసేన నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

  • పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని సీఎం జగన్ గో బ్యాక్ గో బ్యాక్
  • పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పైసా నిధులు కేటాయించని సీఎం జగన్ నియోజకవర్గంలో కాలు పెట్టె అర్హత లేదు.
  • పశ్చిమ నియోజకవర్గాన్ని మోసపూరిత హామీలతో సీఎం జగన్ మోసం చేశారు
  • వెల్లంపల్లి శ్రీనివాసరావు 1500 కోట్ల అవినీతిపై సీఎం జగన్ స్పందించాలి
  • పోతిన వెంకట మహేష్ ను సితార కూడలి వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ఇంటి వద్దనే పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టు చేసినారు.
  • వాహన మిత్ర కోసం వస్తున్న సీఎం జగన్ నిజంగా ఆటో డ్రైవర్ల మీద చిత్తశుద్ధి ఉంటే చలానాలను రద్దు చేయాలి
  • సీఎం జగన్ వాహన మిత్ర పథకం కోసం వస్తున్న సభా వేదిక కు కూతా వేటు దూరంలో పశ్చిమ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పిలుపుమేరకు సితార సెంటర్లో సీఎం జగన్ గో బ్యాక్ గో బ్యాక్ నినాదాల నిరసన హోరు ఎక్కించిన పశ్చిమ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు& జనసైనికులు.

విజయవాడ వెస్ట్సె: ప్టెంబర్ 29వ తారీఖున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార సెంటర్ స్టేడియం వద్ద వాహన మిత్ర పథకం కోసం వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు సితార సెంటర్ కూడలి వద్ద పోతిన వెంకట మహేష్ పిలుపుమేరకు “ సీఎం గో బ్యాక్ గో బ్యాక్” నిరసన కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకొని 26 మందిని భవానిపురం పోలీస్ స్టేషన్ లో మరొక 10 మందిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్టు చేశారు. జనసేన పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది జనసేన పార్టీ నాయకులకు గాయాలై చొక్కాలు కూడా చిరిగినాయి. పోతిన వెంకట మహేష్ ను సితార కూడలి వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ఇంటి వద్దనే పోలీసులు హౌస్ అరెస్టు చేసినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి కేటాయిస్తానన్న 70 కోట్ల రూపాయల నిధుల జమ మరిచిపోయారని, పాత రాజరాజేశ్వరి పేట వాసుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గాలికి వదిలేసారని, గాలి షాహిబ్ దర్గా భూములు వైసిపి నేతల చేతుల్లో కబ్జా చర నుంచి విముక్తి చేయలేకపోయారని, భవానిపురంలో క్రిస్టియన్స్ స్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించలేదని, షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడాన్ని విస్మరించారని, నియోజకవర్గంలోని మహిళలను వైయస్ఆర్సీపీ మరియు సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని ఒక టిడ్కో ఇల్లు గాని, సెంట్ భూమి పథకం కింద జగనన్న కాలనీలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించి గృహప్రవేశం చేయించలేకపోయారని, అవుట్ ఫాల్ ట్రైన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని నేటికీ అందుబాటులోకి తీసుకురాలేకపోయారని, వైసీపీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న మాటలు పచ్చి బూటకం అని వారు అవినీతిలో రాటు తేలిపోయారని, కొండ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, సీఎం జగన్కు దమ్ముంటే వెల్లంపల్లి శ్రీనివాస్ 1500 కోట్ల రూపాయల అవినీతిపై స్పందించాలని, నియోజకవర్గ కార్పొరేటర్లు కూడా వెల్లంపల్లి కి ఏ మాత్రం తీసిపోకుండా అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిన అంశాలపై సీఎం జగన్ దమ్ముంటే స్పందించాలన్నారు. వాహన మిత్ర కోసం వస్తున్న సీఎం జగన్ నిజంగా ఆటో డ్రైవర్ల మీద చిత్తశుద్ధి ఉంటే చలానాలను రద్దు చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన వారిలో మల్లెపు విజయలక్ష్మి, పొట్నూరి శ్రీనివాసరావు, తమ్మిన లీలా కరుణాకర్, కొరగంజి వెంకటరమణ, రాము గుప్తా, గన్ను శంకర్, ఆకారపు విజయ్ కుమారి, భార్గవి, సాబిన్కార్ నరేష్, రెడ్డిపల్లి గంగాధర్, అనిత, ఏలూరు సాయిశరత్, ఎం. హనుమాన్, సోమీ మహేష్, ప్రశాంత్, రోహిత్, ఇందు, మద్దిరాల. కనకారావు, సూరత్. దుర్గారావు తదితరులు ఉన్నారు.