మాకు సంబంధం లేదు…కేంద్రం స్పష్టత

 ఏపీకి 3 రాజధానులను చేస్తూ గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీని పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలోనిదని కేంద్రం హోంశాఖ స్పష్టం చేసింది. రాజధాని కేంద్రానికి సంబంధించి కేంద్రం పాత్ర ఏం లేదని తెలిపింది. చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తెలిపింది. దీంతో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించినట్టైంది.