ముత్తా శశిధర్ నాయకత్వంలో యుద్ధానికి మేము సిద్ధం కార్యక్రమం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సిస్ సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం స్థానిక ఏటిమొగ ప్రాంతంలో బర్రె అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలతో వాగ్ధానాలు చేసి అధికారం చేపట్టిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలో చేసిన వచ్చాకా వాగ్ధానాలను తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేక పాలన చేసి ఇప్పుడు కొత్తగా మేము సిద్ధం అని సభలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉందని అంటూ తన మాటల్లోనే తన ఓటమిని జగన్మోహన రెడ్డి ఒప్పేసుకున్నాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా కులగణన అని అంటూ కొత్త కుయుక్తులు, పన్నాగాలు పన్నడానికి ప్రయత్నాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నాడనీ జనసేన పార్టీ వీటన్నింటినీ ఎదుర్కొనడానికి సిద్ధం అని తెలియచేస్తున్నామని అంటూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి యుద్ధానికి మేము సిద్ధం”, “భయం-కబ్జాలు లేని కాకినాడ కోసం యుద్ధానికి మేము సిద్ధం” , మన బంగారు భవిష్యత్ కోసం – శాంతి భద్రతల కోసం యుద్ధానికి మేము సిద్ధం” అని నినందించారు. దుర్మార్గపాలనతో, అణిచివేత చర్యలతో, అవినీతితో ఈ ఐదుఏండ్లు పాలన చేసి అసలు ఏమొఖం పెట్టుకుని వై.సి.పి పార్టీ ప్రజలవద్దకి ఓటు వేయమని వస్తుందో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా వస్తున్నామనీ వై.సి.పి దౌర్జన్యాలకి చరమగీతం పాడి కొత్త ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియచేసారు. రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రజలే న్యాయ నిర్ణేతలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు దుగ్గన బాబ్జి, ఆకుల శ్రీను, మడ్డు విజయ్, అగ్రహారం సతీష్, శ్రీరాం చక్రవర్తి, గోవిందరావు, వాసంశెట్టి శ్రీను, మోహన్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.