కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 37వ డివిజన్ పాతబస్ స్టాండ్ ప్రాంతంలో బలసాడి శ్రీను ఆధ్వర్యంలో మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల భీంలీలో సిద్ధం అంటూ సభ జరిపారనీ దానికి తాము కాకినాడ సిటి నుండీ స్పందిస్తూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, కాకినాడ సిటి శాసనసభ్యుడు ద్వారంపూడిని దించేందుకు కాకినాడ ప్రజలు సిద్ధం అని తెలియచేస్తూ కార్యక్రమాలను రోజూ చేపడుతున్నామన్నారు. ఈవేళ కాకినాడలో అన్ని సామాజికవర్గాలు అన్నిప్రాంతం వాళ్ళుకూడా ద్వారంపూడిని దింపడానికి మేము సిద్ధం అని చెపుతున్నారన్నారు. ఈ వేళ ఈ ప్రాంతంలో ఎంతోమంది మత్స్యకారులు గానీ యువకులు గానీ ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపొయారన్నారు. ఈ అయిదు సంవత్సరాల కాలంలో ద్వారంపూడి నగరంలో ఎన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు, ఎన్ని ఫాక్టరీలు పెట్టారో చెప్పాలన్నారు. మీ కార్యకర్తలకు కాకుండా వేరెవరికైనా కాంట్లాక్టులు వచ్చాయా చెప్పాలన్నారు. కాకినాడ నగరం నుండీ వలసలు పోకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. మీ అరాచకాలు, దౌర్జన్యాల కాలం అయిపొయిందనీ, కాకినాడ ప్రజలు మరియు తాము అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అందరూ ఒకటే నినందిస్తున్నారనీ “మన ఊరు మన కాకినాడలోనే ఉపాధి కావాలి” అని అంటూ ఈ అయిదేళ్ళలో మీరుగానీ, మీ పార్టీ గానీ చేయని ఈ పనిని జనసేన పార్టీ 20లక్షల ఉద్యోగాలు జనసౌభాగ్య పధకం ద్వారా ఔత్సాహికులతో తామే మరికొంతమందికి ఉపాధి ఇచ్చేలా ఆ బాధ్యత తీసుకుంటుందంటూ దానికి తామందరూ సిద్ధమే అని అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, బలసాడి సత్తిబాబు, మనోహర్లాల్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, వాడ్రేవు లోవరాజు, వాసిరెడ్డి సత్యకుమార్, అడబాల రాజేంద్రప్రసాద్, అప్పన్న, బాబి, శేఖర్ నూకరాజు, దూరం చిరంజీవి, కంట రవిశంకర్, దారపు సతీష్, సోనీ ఫ్లోరెన్స్, దారపు శిరీష, మిరియాల హైమావతి, బట్టు లీల, బండి సుజాత తదితరులు పాల్గొన్నారు.