ముత్తా శశిధర్ నాయకత్వంలో మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో పర్లోవపేట సమీపంలోని టిడ్కో గృహసముదాయాల వద్ద మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈమధ్య కాలంలో ప్రజాప్రతినిధులు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కాకినాడ ఎం.ఎల్.ఏ మాట్లాడుతున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భీమిలిలో సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి అంటారు, కాకినాడలో ఎం.ఎల్.ఏ ద్వారంపూడి ఎవరిని పడితే వారిని దమ్ముంటే నామీద పోటీ చేయి అని ఒకసారి పవన్ కళ్యాణ్ ని నామీద పోటీచేయమని, ఇంకోసారి చంద్రబాబు నాయుడిని నామీద పోటీచేయాలని అంటారు అని చెపుతూ, నేను ఈవేళ అంటున్నాను నేను మూర్ఖంగా మోడీని దమ్ముంటే నామీద ఇక్కడ పోటీ చేయమని అంటాను అది సాధ్యమా అని ప్రశ్నించారు. నిజంగా నీకు ధైర్యముంటే వాళ్ళు ఎక్కడ పోటీచేస్తారో అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని అహంకారపు మాటలు మానాలని హితవు పలికారు. వచ్చే 60 రోజులలో కాకినాడ సిటిలో జరిగే ఎన్నికలలో ద్వారంపూడిని జనసేన పార్టీ ఓడిస్తాది, గాజు గ్లాసు గుర్తుమీద ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తాదనీ ఈ ఇరవై సంవత్సరాలలో ఏనాడైనా బయటివారొచ్చి ఇక్కడ అస్సెంబ్లీకి పోటీ చేసారా అని ప్రశ్నించారు. అందరిలా మీరు ఇన్ని కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారు అని ఆరోపించట్లేదు అహంకారంతో, దౌర్జన్యంతో ప్రజాధనాన్ని దుర్వినియొగం చేసారు , ఈవేళ ఇంతమంది టిడ్కో బాధితుల సమక్షంలో నేను ప్రశ్నిస్తున్నాను ఎంతమంది ఇక్కడ లోపల నివాసముంటున్నారు, నిన్న 250 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ పెట్టామన్నారు మరి అలా అయితే ఇక్కడ ఎన్ని బ్లాకులకు విద్యుత్తు సరఫరానిచ్చారు అని అడిగారు. మిమ్మల్ని అధికారంలో కూర్చోపెట్టింది ప్రజలకు సేవ చేస్తారనీ అంతేకానీ ఏవీ చేయకుండా అహంకారంగా మాట్లాడటానికి కాదన్నారు. ఒకేఒక్క మాట చెపుతున్నాం మేమందరం సిద్ధంగా ఉన్నాం కాకినాడ ప్రజలూ, జనసేన శ్రేణులూ, టిడ్కో బాధితులు అందరం మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈవేళ చెపుతున్నాం తామందరం ప్రతి ప్రాంతంలోకీ వెళతామనీ మిమ్మల్ని ఓడించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ప్రజలాందరికీ తెలియచేయడానికి అని అన్నారు. మీకు ధైర్యం ఉండి నిజంగా అహంకారం లేకపోతే ఈ 60 రోజులలో అయినా ఏమిచేయగలరో చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.