జనసేన కార్యాలయం దగ్గర బ్యానర్లు తొలగించడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోతిన మహేష్ ఆఫీస్ దగ్గర శుక్రవారం అర్ధరాత్రి 20 మంది మున్సిపల్ సిబ్బంది 100 పైగా పోలీసులు వచ్చి బ్యానర్లు తొలగించడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సిపి ఒక రౌడీ పార్టీ అని తెలియజేస్తున్నాం. విఎంసి అధికారులకు అక్రమంగా కట్టే నిర్మాణాలు తొలగించిన ధైర్యం దమ్ము లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే చిల్లర రాజకీయాలు పోలీసులు విఎంసి అధికారులు పూర్తి మద్దతు వాళ్లకు పని చేస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఓటమి ఖరారు అయిందని దానికి నిదర్శనమే రాత్రి జరిగిన సంఘటన ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడన్నా చెయ్ గాని పోతున మహేష్ మీద చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. 2024లో ఎమ్మెల్యే కాబోతున్న పోతిన మహేష్ మీద నీ నీచమైన రాజకీయం చేస్తే ఇంకా సహించేది లేదని పోతిన మహేష్ కార్ టైర్లు గాలి తగ్గినా ఇంటికి వచ్చి కొడతామని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది
ఎం హనుమాన్, 37వ డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాముగుప్తా, బీసీ నాయకులు జాగు సూరిబాబు, జనసేన పార్టీ నాయకులు బండి శ్రీనివాస్ తదితరులు తెలిపారు.