అంగన్వాడి అక్క చెల్లెళ్లకు అండగా ఉంటాం: జనసేన

తిరుపతి: కనీస వేతనం ఇవ్వాలని తిరుపతి మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన తెలియజేస్తున్న “అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ లకు మద్దతుగా బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అంగన్వాడి అక్క చెల్లెళ్లకు వారు చేస్తున్న తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసనలో పాల్గొని జనసేన, టిడిపి మద్దతు తెలియచేశారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరసనకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుపతిలో జనసేన పార్టీ అంగన్వాడీలకు అండగా ఉంటుందని వారి న్యాయమైన పోరాటంకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, అకేపాటి సుభాషిని, ముక్కు సత్యవంతుడు, కొండా రాజమోహన్, మునస్వామి, కిషోర్, గుట్టా నాగరాజు, దినేష్ జైన్, హిమవంత్, హేమంత్, వంశీ, పురుషోత్తం, సాయి దేవ, రమేష్, రవి, హరిక్రిష్ణ, మరియు టిడిపి ముఖ్య నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.