సైనికుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: జమ్ము కాశ్మీర్ లో సైనికుడిగా పనిచేసే శ్రీ అలీముల్లా గారి ఎడల.. పరవాడలో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. రాష్ట్ర ప్రజల హక్కులను, స్వేచ్ఛను వైసిపి ప్రభుత్వం పూర్తిగా హరించి వేస్తాఉంది. సాక్షాత్తు భారతదేశ సైనికుడిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది పోలీసులు, అధికారుల ద్వారా ప్రజలను వేధిస్తూ దిశా యాప్ ను బలవంతంగా ఫోన్లో డౌన్లోడ్ చేయించడం భావ్యం కాదు, మరోవైపు దిశా యాప్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కొంతమంది అధికారులు, పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలని దురుద్దేశంతో ప్రవర్తిస్తూ వారి వారి డిపార్ట్మెంట్లకు చెడ్డ పేరు తెస్తున్నారు. భారతదేశ సైనికుడు అలీముల్లా గారి పైన జరిగిన సంఘటనను పూర్తి విచారణ జరిపించి, సంఘటనకు కారకులైన వారి అందరి పైన తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు మరలా పునరావతం కాకుండా లా అండ్ ఆర్డర్ ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా మమ అనిపిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం.