హెచ్.సి.యు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం!

*తెలంగాణ జనసేన పార్టీ

హెచ్.సి.యు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.​హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్.సి.యు) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. గచ్చిబౌలి పరిసర ప్రాంతంలోని 400 ఎకరాల అడవి భూమిని ప్రభుత్వం ఎటువంటి చర్చలు లేకుండా చెట్లను నరికివేసి, వేలం వేయడానికి ప్రయత్నించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ చర్యలు పర్యావరణానికి మరియు అక్కడ నివసించే పక్షులు, మూగజీవులకు హాని కలిగిస్తాయి. ​గతంలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరై, ప్రజలకు మద్దతు తెలిపారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. లేనిపక్షంలో, జనసేన పార్టీ మరొకసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించవలసి వస్తుంది. అభివృద్ధిని మేము ఎప్పుడూ వ్యతిరేకించము, కానీ పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఈ 400 ఎకరాల అడవి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చడమే కాకుండా, హైదరాబాద్ పరిసరాల్లో నివసించే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చు. ​మీరు తీసుకున్న ఈ నిర్ణయంపై మరొకసారి ఆలోచించి, ఇతర పార్టీ నేతలు మరియు స్వచ్ఛంద సంస్థలతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని శంకర్ గౌడ్ తెలిపారు.

Share this content:

Post Comment