బండారు శ్రీనివాస్ నాయకత్వానికి అండగా మేముంటాం

*జనసేనానే మా అది నాయకుడు.
*శెట్టిబలిజ పెనికేరు గ్రామ యువత, నాయకులు పెద్ద ఎత్తున అధికార పార్టీని వదిలి జనసేనకు మద్దతుగా భారీగా చేరిక.
*జనసేన కొత్తపేట నియోజకవర్గ శెట్టిబలిజ సేవాదళ్ యూత్.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలో, పెనికేరు గ్రామంనందు ఆదివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన జనసేన పార్టీ శెట్టిబలిజ గ్రామ నాయకుల మీటింగు 200 మందితో ఎంతో పెద్ద ఎత్తున జరిగింది. పలువురు ప్రముఖ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీని వదిలి, పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి, ఏమీ ఆశించకుండా భారీగా చేరికలు జరిగాయి. ఈ భారీ చేరికలు చూసి, కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల వారు విశేషంగా చర్చించుకుంటూ, అధికారం లేకపోయినా, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒంటరివాడు కాదని, శెట్టిబలిజ పెనికేరు గ్రామ నాయకులు నిరూపించారని, ప్రజల్లో మార్పు మొదలై పోయిందని, ఇక రాబోయే రోజుల్లో జనసేనాని ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని, మా అందరి నాయకుడని, అన్ని వర్గాల వారితో పాటు, అన్ని కులాల వారితో పాటు,మా శెట్టి బలిజ కులస్తులను గుండెల్లో పెట్టుకుని చూసే, గొప్ప మనసున్న వ్యక్తి అని, అన్ని కులాల వారికి సమన్యాయం జరగాలని, రాజ్యాధికారం అందరూ సమానంగా పంచుకుందామని, ఏ కులము తక్కువ కాదని, గొప్ప మానవతావాదిగా ముందుకు సాగుతున్న జనసేనానికి మేము ఎందుకు మద్దతు ఇవ్వకూడదని, ఎవడు అడ్డం వచ్చినా జనసేనానికి మేము అండగా నిలబడతామని, పెనికేరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున శెట్టి బలిజ కులస్తులు, మాజీ ప్రజాప్రతినిధిలు, ఎక్స్ ఎంపిటిసి శీలం రమణతో పాటు వనచర్ల ధనరాజు నాయకత్వంలో పలువురు శెట్టి బలిజ నాయకులు, శెట్టి బలిజ గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు భారీగా చేరికలు అధిక సంఖ్యలో ప్రారంభమయ్యాయి. ఈ చేరిన ప్రతి ఒక్కరికి క్రియాశీలక సభ్యత్వం తోపాటు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ భీమా పథకం వర్తించే విధంగా వారికి భీమా సౌకర్యం కూడా కల్పించారు. ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన జనసేనాని లాంటి నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరూ లేడని, ముందు ముందు కూడా ఉండడని, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా నడిపించగల నాయకుడుగా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించే మార్గదర్శకుడుగా, ఒక జనసేనాని మాత్రమేనని ఆశాదీపంగా ఉన్నారని, పలువురు శెట్టి బలిజ నాయకులు మాట్లాడుతూ, ఈ సందర్భంగా యువత, నాయకులు పెద్ద ఎత్తున జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని జేజేలు పలుకుతూ, బండారు శ్రీనివాస్ నాయకత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసారు.