పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కామిశెట్టి రమేష్

  • జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్

గురజాల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గురజాల నియోజవర్గం పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ పేర్కొన్నారు. ఆయన్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తదనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, రాష్ట్ర ప్రజలందరూ ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎదురుచూస్తున్నారని, ప్రజాభీష్టం కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, రాబోయే ఎన్నికలలో.. జనసేన, టిడిపి, బిజెపి, కూటమి కలిసి పనిచేసి గెలుపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం నియోజవర్గ కార్యకర్తలందరూ కృషి చేయాలని తెలియజేశారు. రాబోయే రోజుల్లో జనసేన, టిడిపి ఉమ్మడి కార్యచరణ రూపొందిస్తామని, జనసేన కార్యకర్తల గౌరవం తగ్గకుండా సరైన నిర్ణయం మా నాయకుడు తీసుకుంటారని, నాయకుడు మాటని కార్యకర్తలందరూ తూచా తప్పకుండా పాటించాలని కామిశెట్టి రమేష్ తెలియజేశారు.