కొత్త కోడూరు బీచ్ ని అభివృద్ధి చేస్తాం

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నందు ఉన్న కొత్త కోడూరు బీచ్ కు వెళ్లే రోడ్డును సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యాటక రంగానికి సంబంధించి సముద్ర తీరం వెంబడి రెండు మండలాల్లో రెండు బీచ్ లు ఉన్నాయి. అందులో ప్రధానమైనది నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్నది కొత్త కోడూరు బీచ్. ఆ బీచ్ కు ఆనుకొని వేలాంగిని మాత చర్చ్ ఉత్సవాలకి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు అవుతున్నా కనీసం బీచ్ కి వెళ్లే రోడ్డు నిర్మాణం కూడా చేయలేక పోయాడు. ఇటువంటి మంత్రి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా నువ్వు పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏమి చేశావో చెప్పాలి. నీకు నోరు ఉంది కదా అని మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మానేయ్. నీకు మాటల్లేవ్ మాట్లాడే అధికారం లేదు. మా అధినేత పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు. రోజా నీ నోరు అదుపులో పెట్టుకో. రేపు ఎన్నికలలో మా జనసైనికులు నిన్ను నగరి నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి యధాతిధిగా నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికే చేరుస్తారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఏడెనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గం అవసరమా ఒక క్షణం ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బిజెపి కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి. కొత్త కోడూరు బీచ్ ని అభివృద్ధి చేస్తాం. బీచ్ కి వెళ్లే రోడ్డుని నిర్మాణం చేపియిస్తాం. ఆక్రమణకు గురైన భూములను విడిపిస్తాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఉంది. మీ అందరికీ నమస్కరించి నేను ఒక్కటే కోరుతున్న ఒక్క క్షణం ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వెంట ఉంటాం. మీ సమస్యలని పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, శ్రీహరి, జయసుధ, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, మస్తాన్, తోటపల్లి గూడూరు మండల నాయకులు కల్తి రెడ్డి సీనయ్య, రవి, గణేష్, విజయ్, శ్రావణ్, కళ్యాణ్, మనోజ్, కార్తీక్, శివకుమార్, చంద్ర, చిన్న, యేసయ్య తదితరులు పాల్గొన్నారు.