తిరుపతి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శనివారం తిరుపతిలో స్థానిక ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి ఎమ్మెల్యే పెద్ద ఎత్తున వినతులను స్వీకరించారు. ప్రజాదర్భార్ లో మున్సిపల్ కార్పోరేషన్ కు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, అందాయాని, టిటిడి, దేవాదాయశాఖకు సంబంధించి మరియు పోలీసు శాఖకు సంబంధించి, నీటిపారుదల శాఖకు సంబంధించి.. వందకు పైగా వినతులు రావడం జరిగిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సమస్యలన్నింటినీ సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించామాన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడానికి ప్రజాదర్బార్ తో పాటు జనవాణి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ డిప్యూటీ కమీషనర్ అమరయ్య, డిప్యూటీ తహశిల్దార్ రామచంద్రయ్య, ఎస్పీడిఎల్ ఏడి రామాంజనేయులు మరియు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, కార్పోరేటర్లు, స్థానిక సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment