గుమ్మ అశోక్ చేతిలో మోసపోయిన రైతుల పక్షాన పోరాడతాం: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అనుచరుడైన మనుబోలు మండలానికి సంబంధించిన ధాన్యం దళారీ గుమ్మ అశోక్ చేతిలో మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ సందర్బంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి ముఖ్య అనుచరుడు మనుబోలు మండలానికి సంబంధించిన వైసీపీ నాయకుడు, వైసీపీ ఉప సర్పంచ్ ధాన్యం దళారి గుమ్మా అశోక్ కౌలు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి గత ఎనిమిది నెలల నుంచి రైతులకు డబ్బులు చెల్లించకుండా పక్క రాష్ట్రాల్లో సంచరిస్తుంటే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు వేస్తున్న జిల్లా అధికారులపై తప్పించుకుని తిరుగుతున్న ధాన్యం దళారి గుమ్మ అశోక్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున మేము కోరడమైనది. తోటపల్లిగూడూరు మండలంలో ఎవరైనా సరే ధాన్యాన్ని గుమ్మ అశోక్ ఇచ్చి మీకు డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉంటే మీ పేర్లన్నీటిని కూడా జనసేన పార్టీకి ఇచ్చిన ఎడల మీ పక్షాన నిలబడి జనసేన పార్టీ పోరాడుతుంది. దీనికి ఉద్దేశించి ఆదివారం ఈ కార్యక్రమాన్ని తోటపల్లి గూడూరు మండలంలో నిర్వహించడం జరిగింది. ధాన్యం దళారి గుమ్మ అశోక్ సర్వేపల్లి నియోజకవర్గంతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలోని వందలాది మంది రైతులకు రూ.కోట్ల రూపాయల డబ్బులు ఎగనాం కొట్టి పక్క రాష్ట్రాల్లో దర్జాగా సంచరిస్తున్నాడు. ఆయన చేతిలో మోసపోయిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు చర్యలు లేవు. దీనికి కారణం అధికార పార్టీ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అనుచరుడు కావడమే. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేయడం ఏమనగా ధాన్యం దళారి గుమ్మ అశోక్ చేతిలో మోసపోయిన రైతులు ఎవరైనా ఉంటే నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికైనా, సర్వేపల్లి గ్రామంలో ఉన్న నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నైనా, స్థానిక జనసేన పార్టీ నాయకుల దృష్టికైనా తీసుకువచ్చిన ఎడల వారి పక్షాన జనసేన పార్టీ నిలబడుతుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సందీప్, జనసేన పార్టీ నాయకులు రాకేష్, షేక్ రహీం, శ్రీహరి, జడ్డా చిన్న, బట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు.