న్యాయం జరిగే వరకు పోరాడుతాం

  • మున్సిపల్ కార్మికులు మలినాలను శుభ్రం చేస్తూ చనిపోవడం బాధాకరం.
  • మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
  • సఫాయి కర్మచారి కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం
  • ఎవరో ఇద్దరు సంబంధంలేని సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు
  • డిప్యూటీ కమీషనర్ పై చర్యలు తీసుకోవాలి
  • సఫాయి కర్మచారి నిబంధనల ప్రకారం చేతితో మలాన్ని తొలగించడం నిషిద్దం

తిరుపతి, బుధవారం స్థానిక వైకుంఠపురం మున్సిపల్ కార్మికులు మృతి చెందిన ఆర్ముగం, మహేష్ లకు జనసేన పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి చేస్తున్నామని, ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని, పారిశుద్ధ్య కార్మికులకు సరైన పనిముట్లు, ఆధునిక పరికరాలు లేని కారణంగా ఇలా ఊపిరాడని మ్యాన్ హోల్ లో దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, ఇప్పటికే చాలీచాలని జీతాలతో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల మున్సిపల్ శాఖ నిర్లక్ష్య ధోరణి బాధ్యతారహితంగా ఉంది అని, మృతుల కుటుంబాలకు 5లక్షల ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఒక్కో మృతుని కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బుధవారం మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసిన జనసేన పార్టీ ఈ సందర్భంగా నాయకులు రాజేష్ యాదవ్, కీర్తన, మునస్వామి, లక్ష్మి, రాజు మోహన్, లోకేష్, మనోజ్ లు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ వారి తరపున పోరాటం చేయడానికి సిద్ధం అవుతుందని మున్సిపల్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.