జనసైనికుడు రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పోరాడుతాం..

  • ఇసుక మాఫియా నడుపుతున్నటువంటి వ్యక్తుల చేతుల్లో హత్యకుగురైన జనసైనికుడు సదాశివుని రాజేష్

శ్రీకాకుళం నియోజకవర్గం: జనసేన పార్టీలో క్రియాశీలకంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకొ విశిష్ట సేవలు అందించినటువంటి జనసైనికుడు సదాశివుని రాజేష్ శ్రీకాకుళం రూరల్ మండల్ అరసవల్లి గ్రామ నివాసి. దురదృష్టవశాత్తు 2023 జూన్ 1వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇసుక మాఫియా నడుపుతున్నటువంటి వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జి కోరాడ సర్వేశ్వరరావు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకి తన సానుభూతిని తెలుపుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన విషయాలని పార్టీ దృష్టికి తీసుకెళ్లి జనసైనికుడు సదాశివుని రాజేష్ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చేస్తానని, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు వివరాలు రాగానే జరిగిన సంఘటనపై భారీ ఎత్తున జనసేన తరఫున ఇసుక మాఫియాపై తగు చర్యలు తీసుకునే విధంగా నియోజవర్గమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలతో కలిసి పోరాటం చేస్తానని సర్వేశ్వరరావు తన మాటల్లో చెప్పడం జరిగింది. రాజేష్ కి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్నందున యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కుటుంబాలకి రావలసినటువంటి భీమా వచ్చే విధంగా చేస్తామని చెప్పారు.