వై.సి.పి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల తరపున అలుపులేని పోరాటం చేస్తాం: ముత్తా శశిథర్

కాకినాడ సిటి: గురువారం కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం- మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ముత్తా శశిథర్ నేతృత్వంలో సాయంత్రం 5.30 గంటలకు 24 ఏ వ వార్డు సచివాలయం పరిధిలో బండి అజయ్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్నామని, దానికి తోడు నిత్యావసర సరుకులు విపరీతమైన ధరలు ఉన్నాయనీ వాపోయారు. ఇక కరెంటు చార్జీలు చెప్పనక్కర్లేదని, ఇళ్ళ పట్టాలు అందరికీ మంజూరు చేయలెదని, పించనులు కూడా ఇవ్వట్లేదని ఆక్రోశించారు. ముత్తా శశిధర్ మాట్లాడుతూ పేదలు అద్దె ఇళ్ళలో ఉంటారనీ, మూడు నాలుగు కుటుంబాలు కలిసి ఇరుకిరుకుగా ఇళ్ళలో జీవనం సాగిస్తారనీ అందరి ఇళ్ళకూ కలిపి ఒకటే మీటరు ఉన్నప్పుడు నేడు వున్న స్లాబ్ చార్జీలవల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడు అవుతోందని ఎక్కడ చూసినా ప్రజలు గగ్గోలు పెడుతున్నారనీ, ఐనా ఈ వై.సి.పి ప్రభుత్వానికి ఆదాయం మీద తప్ప ప్రజల కష్టాలమీద శ్రద్ధ లేదన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు నిస్తేజంగా ఉన్నారనీ, ఇక యువత చూస్తే నిర్వీర్యం ఐపోతున్నారనీ ఇది ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఈ వై.సి.పి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల తరపున అలుపులేని పోరాటాన్ని చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యడర్శి వాశిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, ప్రశాంత్ కుమార్, శ్రీను, శివ, కొండబాబు, వీరమహిళలు కుమారి, జానకి మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.