ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2024లో జనసేన జెండా ఎగరేస్తాం: గాదె

గుంటూరు, ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలం అబ్బినేని గుంట పాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో జనసేన పార్టీ జెండా దిమ్మె ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుబ్ కమల్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీ అని, ప్రజలంతా పార్టీకి అండగా నిలబడాలని తెలియజేశారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో కూడిన పార్టీ అని, పల్లెలంతా పచ్చగా ఉండాలని, యువతకు ఉపాధి రావాలని, రైతు సంతోషంగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలని కోరుకునే పార్టీ అని తెలియజేశారు. అలాగే ఈ ప్రాంతంలో గత 80 సంవత్సరాల నుంచి ప్రధానంగా ఉన్న సమస్య గుంటూరు చానల్ పొడిగింపని, ఇప్పటివరకు ఆ సమస్య తీర్చకపోవడం ఇప్పటివరకు ఎన్నికైన నాయకుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని, అలాగే ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి నాయకులు ఎన్నుకోవాలని, జనసేన పార్టీకి అండగా నిలబడాలని తెలియజేశారు. అలాగే 2024లో ప్రత్తిపాడు నియోజవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని తెలియజేశారు. తదనంతరం జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, మహిళా నాయకులు పాకనాటి రమాదేవి, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రత్తయ్య, జిల్లా కార్యదర్శులు చట్టాల త్రినాథ్, డేగల లక్ష్మణ్, గుంటూరు నగర ఉపాధ్యక్షులు చింత రాజు, కార్యదర్శులు పావులూరు కోటేశ్వరరావు,తన్నీరు గంగరాజు,మండల అధ్యక్షులు కొల్ల గోపి, గంధం సురేష్, పత్తి భవన్నారాయణ, గడ్డం శ్రీనివాసరావు, పెదనందిపాడు మండల నాయకులు నరేంద్ర, అబ్బినేని గుంట పాలెం గ్రామ ప్రెసిడెంట్ రాంబాబు, మండల కమిటీ సభ్యులు పొత్తూరి శంకర్,సాయి కృష్ణ, గోపిశెట్టి సాయి, బిసాబత్తిన సాయి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.