హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తాము

తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గం: వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ నిర్ణయించింది. అందుకుగాను 32 స్థానాల జాబితాను విడుదల చేసింది. 32 నియోజకవర్గ జాబితాల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చోటు దక్కింనందుకు గాను నియోజకవర్గ జనసేన నాయకుల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాలుస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగురవేసి అధినేత ఆశయాలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తోడేటి సంపత్, సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్, సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, కోహెడ మండల అధ్యక్షుడు శ్రావణపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వేల్పుల మధు, గుండా సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.