ప్రజా గళం సభను విజయవంతం చెయ్యండి

  • పెనమలూరు నియోజకవర్గ ప్రజా గళాన్ని ప్రత్యర్థులకు బలంగా వినిపిస్తాం
  • జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా

పెనమలూరు: కంకిపాడు టీడీపీ పార్టీ ఆఫీస్ లో శనివారం జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం పెద్ద మార్కెట్ సెంటర్ లో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రచార సభగా “ప్రజా గళం” తో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరు సభలో పాల్గొననున్నారు. కావున జనసైనికులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు సుదిమిళ్ల రవీంద్ర, బీజేపీ మండల అధ్యక్షులు పువ్వాడ కృష్ణ మోహన్, కంకిపాడు జనసేన గ్రామ అధ్యక్షులు బోయిన నాగరాజు, ఉమ్మడి నాయకులు వెలగపూడి శంకర్ బాబు, మద్దాలి రామచంద్ర రావు, తుమ్మలపల్లి హరి కృష్ణ, యలమంచిలి కిషోర్ బాబు, అన్నే దనయ్య, పులి శ్రీను, కొట్టెలు వెంకటేశ్వర రావు, యేనుగ జయ ప్రకాష్, వినయ్ లు ఆదివారం కార్యక్రమం విజయవంతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు.