వ్యక్తిగత విమర్శలను తిప్పి కొడతాం!

గుంటకల్ పట్టణంలోని కసాపురం రోడ్డులో జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జనసేన శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను ఖండించారు. ఇటీవల జనసేన నాయకుడు వాసగిరి మణికంఠ కుటుంబ సభ్యులతో గుడిని సందర్శించడాన్ని వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులుమడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ మాట్లాడుతూ, “అభినవ కర్ణుడిగా నిలిచిన పవన్ కళ్యాణ్‌గారి సేవా ధోరణిని విమర్శించేవారు ముందు తమ తల్లికి న్యాయం చేశారా అనే ప్రశ్న జనంలో ఉంది. ఇతరులను వ్యక్తిగతంగా విమర్శిస్తే మీ నాయకుల వ్యవహారాలపై ఆధారాలతో సహా బయటపెడతాం,” అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి పై ప్రశంసలు.. జనసేన నాయకులు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రిగా ఏడాదిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన పవన్ కళ్యాణ్ గారి పాలన ప్రజలలో నమ్మకాన్ని ఏర్పరిచిందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే రోజు 12,000 గ్రామసభలు నిర్వహించడం, అటవీ ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం వంటి కార్యక్రమాలను శ్లాఘనగా గుర్తుచేశారు. వేదపండితుల గౌరవం విషయంలో తప్పుదారి పట్టిన వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు గుడిలో ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ, వేద పండితులు, పూజారుల తేడా తెలియని నాయకులు మాట్లాడడం సరికాదని జనసేన శ్రేణులు అన్నారు. వాసగిరి మణికంఠ పై చేసిన విమర్శలు అవాస్తవాలు అని, ఆయన సేవా ధోరణికి జనసేన అధినాయకత్వం గౌరవం ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై తీవ్ర విమర్శలు వైసీపీ హయాంలో పామిడి బహిరంగ సభలో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, పదవులు ప్రజల కోసం కాకుండా లబ్ధిదారుల కోసం వాడిన వైసీపీ నాయకులు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ధోని ముక్కల రోడ్డులో జరిగిన అవినీతిని బయటపెట్టి పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఘన విజయమే లక్ష్యంగా: జనసేన నేతలు వాసగిరి మణికంఠను జిల్లా కార్యదర్శిగా ప్రోత్సహించడం పార్టీ నాయకత్వం తీసుకున్న నిజాయితీ నిర్ణయమని జనసేన నాయకులు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నేతలు నందా, అంజి, రాఘవేంద్ర, అమర్, విజయ్, లారెన్స్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment