జనసేన బలోపేతం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కరిస్తాం: మర్రాపు సురేష్

  • విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కరిస్తాం.. గజపతినగరం నియోజకవర్గ జనసేన నాయకులు మర్రాపు సురేష్

విజయనగరం: గజపతినగరం నియోజకవర్గ జనసేన నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశాలకి విచ్చేయుచున్న పొలిటికల్ ఎఫైర్ కమిటీ చైర్మన్ గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ కు
22వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు దగ్గర నుంచి పెందుర్తి మీదగా, కొత్తవలస, ఎస్.కోట బొడ్డారు జంక్షన్, తాటిపూడి మీదగా తామరపిల్లి దగ్గరున్న
గ్రీన్ బ్రీజ్ రిసార్ట్ కు భారీగా స్వాగతం పలుకుతూ జన శ్రేణులతో చేరుకుంటారని తెలియజేసారు. ఐదు రోజులు పాటు 22 నుంచి 26వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. నవంబర్ 23వ తేదీ, బుధవారం ఉదయం 10 గంటలకు గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలతో నాయకులతో వీర మహిళలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పాల్గొంటున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతం ద్వారా ప్రజాసమస్య పరిష్కరిస్తాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడి ప్రాంతమైన ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా ఒకటి, జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు సమస్యలు పరిష్కారాలతో ప్రజలకు పార్టీ స్థానిక నాయకత్వం అండగా నిలబడే విధంగా పార్టీని పటిష్ట పరచడంపై ఒక కార్యచరణ రూపొందించుకుంటాం. ముఖ్యంగా విజయనగరం కి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న గుంకులంలో పేదవారి కోసం నిర్మాణం జరగవలసిన ప్రాంతాన్ని 13వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఆ సందర్భంగా అనేకమంది యువకులు తో మాట్లాడారు.. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో పలు సమస్యలపై యువకులు ఆవేదనతో ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ గారి ముందు కలత చెందారు ఉపాధి కరువై, వలసలు, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, రైతు కడుపు నింపని ప్రభుత్వం, వ్యవసాయం, ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నాయి దీనికి తోడు ఒకప్పుడు జిల్లాకి తలమానికంగా ఉన్న జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి, తోటపల్లి నిర్వాసితులు సమస్యలు, రామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులు, ఒక అడుగు ముందుకు పడడం లేదు గిరిజనులకు ఆసుపత్రికి వెళ్లాలంటే మంచాలతో, ఇది కొన్ని మచ్చుకు మాత్రమే ఇవన్నీ నిజానికి పరిష్కరించలేని సమస్యలు కావు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మంచి చేయాలని తలంపు లేకపోవడమే, దీని పట్ల జనసేన పార్టీ పోరాటం చేస్తుంది క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మిడతాన రవి కుమార్, గజపతినగరం నాయకులు రాము, హరీష్ నాని, పండు కలిగి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.