ప్రతి జనసేన కార్యకర్తకు కష్టాల్లో అండగా నిలుస్తాం: ముకుంద నాయుడు

వనపర్తికి చెందిన జనసేన కార్యకర్త పి.నరసింహ ఉపాది నిమిత్తం హైదరాబాద్ వెళ్లి పని చేసుకుంటున్న సమయంలో ఇటీవల బైక్ ఆక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చికిత్స పొంది గత కొంత కాలంగా ఇంట్లో వుంటున్నాడు. విషయం తెలుసుకున్న వనపర్తి కో ఆర్డినేటర్ ముకుంద నాయుడు నరసింహకు పార్టీ తరుపున అండగా నిలుస్తూ వారి మెడికల్ ఖర్చులకు 8 వేల రూపాయలను ఆర్థికంగా సాయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముకుంద నాయుడు మాట్లాడుతూ.. బీద కుటుంబం అయిన నరసింహ కుటుంబ పరిస్థితిని పార్టీ పెద్దలకు తెలిపి, అలాగే వీలైనంత త్వరగా వారికి పార్టీ నుంచి 50 వేలు మెడికల్ ఇన్సూరెన్స్ అందిస్తామని ప్రతి కార్యకర్త యోగ క్షేమమే పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యమని, క్రియాశీలక సభ్యత్వం అనేది కార్యకర్తకు ఎంతో భద్రతను ఇస్తుందని గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం వనపర్తి నియోకవర్గస్థాయిలో అధిక స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావడం జరిగిందనీ యువత జనసేన వైపు మొగ్గచూపుతున్నారనీ తెలిపారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల యోగ క్షేమమే ధ్యేయంగా సభ్యులకు 5 లక్షల ప్రమాద భీమతో పాటు 50 వేలు మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ నుంచి అందిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని, వనపర్తి నుంచి పోటీలో నిలిపేందుకు అలాగే విలువైన ఓటు బ్యాంకు సాధించి ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మార్పుకు సూచికగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వనపర్తి నాయకులు బాలకృష, సురేష్ కుమార్, సతీశ్ సాగర్, నితిన్, కొంకలి మహేష్, పసుల సంజీవ్, నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.