కరెంట్ చార్జీల పేరిట భారీ దోపిడీ అడ్డుకుంటాం అధికార పార్టీని కూలదోస్తాం: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ… పన్నుల పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత లేదని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పెంచిన కరెంట్ చార్జీలను నిరసిస్తూ…పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు… గుంటూరు పార్టీ కార్యలయం నందు అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి పాదయాత్రగా రాష్ట్ర నాయకులు, జనసైనికులతో కలసి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటూ ధనిక వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని ప్రజలెవరు సంతోషంగా లేరన్నారు. ఇసుక బాదుడు, మద్యం బాదుడు, చెత్త పన్ను బాదుడు, ఆస్తి పన్ను, పాత ఇళ్లపై కొత్తగా ఓటీఎస్‌ బాదుడు! రైతులపై నీటి పన్ను బాదుడు, నిత్యావసర వస్తువులపై బాదుడు, ఇప్పడు కరెంటుచార్జీలతో పేదల్ని దోచుకుంటున్నారని గాదె విమర్శించారు. ఆక్కమ్మ, చెల్లెమ్మ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఈరోజు వారికే పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు…. ఫ్యాన్ కి ఓటేస్తే ఇప్పడు ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదన్నారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు పన్నులతో గుద్దుతున్నాడని రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు…. పోలీసులను అడ్డుబెట్టి జనసైనికులను అడ్డుకోలేరని…రాష్ట్రంలో నియంతపరిపాలన నడుస్తుందని ..దీనిని అడ్డుకుంటామని చెప్పారు. అనంతరం కలెక్టరెట్ లో పెంచిన విద్యుత్ చార్జీలు తగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.