*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చం నాయుడు
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని గొల్లమడుగు పండ్ల ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చం నాయుడు, మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 168 కోట్ల రూపాయలను మామిడి రైతులకు సబ్సిడీగా అందించనుందని, ప్రతి కేజీ మామిడికాయకు రూ.8 ధరగా నిర్ణయించబడగా, ఇందులో రూ.4 ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయనుందని తెలిపారు. రైతులు స్వేచ్ఛగా మార్కెట్లలో గాని, మండళ్లలో గాని తమ పంటను విక్రయించవచ్చునని స్పష్టం చేశారు. నాణ్యమైన పంటను కంపెనీలకు సరఫరా చేయాలని సూచించిన ఆయన, ఇప్పటికే 22 మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనుగోలు చేయబడినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ ప్రసాద్ రావు, హార్టికల్చర్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment