జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: మూల హరీష్ గౌడ్

తెలంగాణ, రామగుండం నియోజకవర్గం: గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లామని తెలిపారు. ప్రజారాజ్యం సమయంలో కేవలం 2000 ఓట్లతో ఈ నియోజకవర్గంలో ఓడిపోయామని ఆ ఓట్ బ్యాంక్ ఇప్పటికి స్థిరంగా ఉందని వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల సమయంలో ప్రచారానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తారని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచేది జనసేన పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ నాయకురాలు మంగ, ఏముర్ల రంజిత్, లింగం బాలరాజు, రవికాంత్, గొడిసెల మహేందర్, రాజశేఖర్, ప్రసాద్, అశ్రీత్ తదితరులు పాల్గొన్నారు.