పవన్, కందుల దుర్గేష్ ల జోలికి వస్తే తాట తీస్తాం: పోలిరెడ్డి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని గానీ, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్జెష్ పై గాని దుష్ప్రచారం చేస్తే సహించేది లేదంటూ నిడదవోలు నియోజకవర్గం జనసైనికులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం మంత్రి కార్యాలయంలో నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు వెంకటరత్నం నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మీద నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గేష్ పై కొంతమంది పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని, గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని రావణ కాష్టం గామార్చిన వైసీపీ పాలన లో ఈ పేటీఎం బ్యాచ్ ఏమయ్యారని ఈరోజు కూ టమీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే చూస్తూ సహించలేక ఇటువంటి దృశప్రచారాలు లేవనెత్తుతున్నారని ఇకనైనా వారు ఇటువంటివి మానుకుని రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, లేదంటే జగన్మోహన్రెడ్డిలా ప్యాలెస్ కే పరిమితం కావాలని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అవమానిస్తున్న చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నా మంటే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సహనం మే కారణమని, దానిని ఆసరాగా తీసుకుని అసమర్థులుగా లెక్కవేస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అయినా జనసైనికులు వెనుకాడరని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్న కొందరు పేటియం బ్యాచ్ పై ఎస్సై జి.పరమహంస ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, పాలా వీరాస్వామి, తోపారాల కళ్యాణ్ చక్రవర్తి, ఇంద్ర గౌడ్, పూర్ణచంద్రరావ్, బాలు, నిడదవోలు నియోజకవర్గం నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment