నర్సీపట్నం నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం: సూర్యచంద్ర

నర్సీపట్నం: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి నర్సీపట్నం వస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి నర్సీపట్నం నియోజకవర్గంలోని సమస్యలపై వినతిపత్రం అందజేస్తామని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర పేర్కొన్నారు. సోమవారం నర్సీపట్నం ఎన్జీఓ హోమ్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్ విమర్శలకు ఇస్తున్న ప్రాముఖ్యత నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదన్నారు. దీంతో తామే నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరిస్తామని చెప్పారు. ముఖ్యంగా మాకవరపాలెం మండంలో గల ఆన్ రాక్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. దివంగత నేత వైయస్. రాజశేఖర్రెడ్డి చరిష్మాతో మీరు ముఖ్యమంత్రి అయ్యారని, మీ తండ్రి హయాంలో ఏర్పాటు చేసిన అన్ రాక్ కర్మాగారానికి భూములు ఇచ్చిన రైతులకు, ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారి త్యాగాలను గుర్తించి భూమి ఇచ్చిన రైతులు సమస్యలు పరిష్కరించాలన్నారు.