భూకబ్జా దారుల నిగ్గు తేలుస్తాం

  • శాశ్వత అఖిలపక్ష కమిటీ హెచ్చరిక

తిరుపతి సిటీ: తిరుపతిలో గత ఐదు సంవత్సరాలుగా భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, దీనిపై తాము నూతనంగా ఏర్పాటు చేసిన తమ శాశ్వత అఖిలపక్ష కమిటీ పోరాడుతుందని, ఈ కబ్జాదారుల నిగ్గు తేల్చి స్థానిక బాధితులకు న్యాయం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశామన ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు హెచ్చరించారు. గురువారం తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్ నందు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి భూ కబ్జా బాధితులు హాజరవడం గమనార్హం, భూ కబ్జాల వెనుక ఎంతటి వారున్నా వారిని ఎదుర్కొని శిక్షపడేలా చేసేందుకు గవర్నర్ను కూడా కలుస్తామని బాధితులకు కమిటీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కిరణ్ రాయల్, రాజా రెడ్డి, సుభాషిణి, ఊకా విజయ్ కుమార్, భాను ప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, ముని సుబ్రహ్మణ్యం, పోనగంటి భాస్కర్, చిన్నబాబు, గట్టు నగేష్, తూపల్లి జనార్దన్, సుబ్రహ్మణ్యం, వాసు మరియు టిడిపి, బిజెపి, జనసేన, సీపీఎం, సిపిఐ, అమ్ ఆద్మీ, రాజు క్షత్రాణి ఐక్యవేదిక అధ్యక్షురాలు శ్రీదేవి, కన్వీనర్ వసంత, ఉప్పలపాటి సంధ్యారాణి, సుజాత, ప్రవీణ.. భూ బాధితులు రుద్రరాజు, సంపూర్ణమ్మ, దొమ్మరాజు లక్ష్మమ్మ, సుమతి, విజయలక్ష్మి, కృష్ణంరాజు తదితరులతోపాటు ఎస్ టి ఆర్ ఎఫ్ రీజనల్ కోఆర్డినేటర్ సుకుమార్ రాజు, గుట్ట నాగరాజు రాయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.