గజపతినగరం గెలిచి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తాం: పడాల అరుణ

గజపతినగరం, మాజీ మంత్రి వర్యులు జనసేనపార్టీ రాజకీయ వవ్యహారాల కమిటీ సభ్యులు శ్రీమతి పడాల అరుణ ఆధ్యర్యంలో గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అరుణ మాట్లాడ్లతూ గజపతినగరం మండలం నియోజకవర్గంలో 2500 కొత్త ఓట్లు నమోదు చేయడం చాలా సంతోషకరమని చాలా మంది యువత జనసేన పార్టీకే నా మొదటి ఓటు అంటున్న యువతకు నా యొక్క అభినందనలు మరియు నా యొక్క ఆశీస్సులు అంటూ ఈ సారి ఎలాగైనా గజపతినగరం నియోజకవర్గం గెలిచి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తానని తెలియజేస్తున్నాను, ప్రజలు సమస్యలు తెలుసుకుంటాను సమస్యలపై పోరాడుతాను 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవిధంగా మేము కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ యువ నాయకులు పడాల శరత్ మండలం అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, మామిడి దుర్గా ప్రసాద్, సాయిలోకేష్, బొండపల్లి మండలం నాయకులు నారాయణ రావు జనసైనికులు మరియు మెంటాడ మండలం నాయకులు, చంద్రశేఖర్, కిరణ్, చిన్న జనసైనికులు పాల్గొన్నారు.