సర్వేపల్లిలో కూటమిని గెలిపించి తీరుతాం

సర్వేపల్లి, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల ప్రధాన మండల కార్యదర్శి రహీం జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు పోలీట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలవడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని 35వేల ఓట్ల మెజార్టీతో సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిపించి తీరుతామని చెప్పి ఆయనకు భరోసానివ్వడంతోపాటు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో అత్యధిక మెజార్టీని ఇవ్వడానికికి జనసేన పార్టీ నుంచి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, శ్రీహరి ముత్తుకూరు మండల ఉపాధ్యక్షుడు అశోక్ ప్రధాన కార్యదర్శి కావలి పవన్, రేగల వెంకటేష్, కోశాధికారి కావలి మస్తాన్, అధికార ప్రతినిధి పట్టపు నవీన్, టిపి గూడూరు మండల నాయకులు యేసయ్య, షేక్ సర్దార్, మనుబోలు మండల నాయకుల సుధాకర్ పాల్గొన్నారు.