జనసేన, టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి థామస్ గెలుపుకు కృషిచేస్తాం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: ఎస్ ఆర్ పురం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా వస్తున్న జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం లేదని, అలాగే టీడీపీ వారు జనసేన పార్టీ నాయకులను విస్మరిస్తున్నారని వస్తున్న అసత్య ప్రచారలను తిప్పి కొట్టండం జరిగింది. జనసేన, టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి థామస్ గెలుపుకు కృషిచేస్తామని ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు, చిరంజీవి, పేనుమురు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గంగాధర నెల్లూరు మండల అధ్యక్షడు సురేష్ రెడ్డి, ఐటీ కోఆర్డినేటర్ రూపేష్, జనసేన నాయకులు, సురేష్ సామంతి, ఎస్ ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు చందు, చార్లెస్, బాల రాజు, బాలాజీ రెడ్డి, నాగరాజు, దేవ రామచంద్ర, పండు (గంగాధరం), పల సురేష్, కుమార్, సూర్య, వంశీ, సాయి ప్రకాష్, ఢిల్లీ, టీడీపీ నాయకులు నరసింహ రెడీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.