వివేకా హత్య కేసులో ఆయుధాలు స్వాధీనం

ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక ముందుడుగు వేసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించింది. కస్టడీ విచారణలో సునీల్ చెప్పిన వివరాల ఆధారంగా వివేకా హత్యకు వాడిన ఆయుధాలను సీబీఐ గుర్తించింది.వైఎస్ వివేకా హత్య కేసు ఈ పరిణామంతో కీలక మలుపు తిరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.అనుమానితుల ఇళ్లలోనే ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేసింది. మొదట తనకు తెలియదంటూ సునీల్ యాదవ్ తప్పుదోవ పట్టించాడని.. రెండు వాగుల్లో ఆయుధాలు వేశామని చెప్పి అబద్దం చెప్పాడని సీబీఐ తెలిపింది. కానీ తర్వాత నిందితుల ఇళ్లలోనే ఆ ఆయుధాలను దాచారని.. వాటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.

మొదట సీబీఐ విచారణలో వైఎస్ వివేకా హత్యకు వాడిన ఆయుధాలను పులివెందులలోని రోటరీపురం వాగులోని ఇసుకలో దాచిపెట్టినట్లు సునీల్ యాదవ్ తెలుపడంతో అధికారులు వాటిని వెలికి తీసే పనిలో పడ్డారు. కానీ ఎక్కడా అవి దొరకలేదు. ఎంత వెతికినా నీటిని ఖాళీ చేసినా జాడ దొరకలేదు.

రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు తాజాగా ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సునీల్ కుమార్ యాదవ్ ను మరోసారి విచారించారు.రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. సునీల్ ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ సమాచారంతో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తోందని సీబీఐ భావిస్తోంది. వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరెవరున్నారు. వాడిన ఆయుధాలేంటి? ఇలా పలు అంశాలపై సునీల్ యాదవ్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను పులివెందులలోని పలు చోట్లకు తిప్పుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును మలుపుతిప్పే ఆధారలు దొరికినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వివేకా హత్యకు వాడిన ఆయుధాలను తెలుసుకున్న అధికారులు వాటిని ఎక్కడ దాచారో కనిపెట్టారు. స్తానిక రోటరీనగర్ లోని వాగు ఇసుక లో వివేకా హత్యకు వాడిన ఆయుధాలు నిందితుల ఇళ్లలోనే గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసులో పురోగతి సాధించినట్లు అవుతుందని సీబీఐ భావిస్తోంది.