కొరికాన రవి కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ‘వీవింగ్‌ లైవ్స్‌’ డాక్యుమెంటరీ చిత్ర బృందం

ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ బ్యాక్‌డ్రాప్‌గా చేనేత కార్మికుల జీవితాలను ప్రతిభింబించేలా తీసిన లఘు చిత్రం ‘వీవింగ్‌ లైవ్స్‌’ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ తెలంగాణలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డ్‌ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీని సంపత్‌ పవన్‌ ఫిల్మ్‌ కంపెనీ, శ్రీకాకుళం హవా కలిసి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో పలువురు ప్రతిభావంతులైన వ్యక్తులు సహకారాన్ని అందించారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి గుర్తింపు పొందడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా భావిస్తూ, ‘వీవింగ్‌ లైవ్స్‌’ పేరుతో తీసిన లఘుచిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు రావడం పట్ల ఎస్.యు.డి.ఏ చైర్మన్, శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు కొరికాన రవికుమార్ చిత్ర బృందనికి సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.

Share this content:

Post Comment