మెగా ఫ్యామిలీలో పెళ్లిళ్ల సందడి

మెగా ఫ్యామిలీలో మారికొన్ని రోజుల్లో నిహారిక పెళ్లి గ్రాండ్ గా జరగబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా నిర్వహించినప్పటికి పెళ్లిని మాత్రం గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు. కరోనా హడావుడి పూర్తిగా తగ్గిన తరువాతనే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. కుదిరితే డిసెంబర్ లోనే ముహూర్తం ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. నిహారిక పెళ్లి అయిన తర్వాత మారికొన్ని రోజుల్లోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

తేజూ ప్రేమ వివాహం కాకుండా మామయ్య చిరంజీవి చూపించిన అమ్మాయిని చేసుకుంటానంటూ తల్లితో అన్నాడట. దాంతో చిరంజీవి తనకున్న పరిచయాలతో తేజూకు అమ్మాయిని చూస్తున్నారట. తెలిసిన వారి ద్వారా సాయి ధరమ్ తేజ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చిరంజీవి సోదరి ప్రస్తుతం తేజూ పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. ఈ ఏడాది చివరి వరకు లేదా త్వరలోనే తేజూకు తగ్గ ఒక అమ్మాయి ని ఎంపిక చేసి.. నిహారిక పెళ్లి పూర్తి అయిన వెంటనే తేజూ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది.