తాడిపత్రి జనసైనికుడి వివాహ ఆహ్వానం

తాడిపత్రి పట్టణంలోని జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అచ్చుకట్ల అక్తాఫ్ పెళ్లి పత్రికను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి భవానీ రవి కుమార్ ని, ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరామ్ రెడ్డి ని, జిల్లా నాయకులు పెండ్యాల హరి, శ్రీలత ని, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి కలేషా ని మరియు జనసేన పార్టీ జిల్లా స్థాయి నాయకులను ఈ నెల 27 వ తేదీన జరిగే వివాహానికి ఆహ్వానించగా తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తామని హామీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాబోయే వరుడు ఆచ్చుకట్ల ఆల్తాఫ్, తాడిపత్రి జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహాచారి, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు మాదినేని గోపాల్ మరియు జసైనికులు పాల్గొన్నారు.