కేటీఆర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

ఓ అభిమాని తెలంగాణ మంత్రి కేటీఆర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను వెరైటీగా చెప్పారు. కేటీఆర్ సేవా సమితి, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ ముజీబ్.. ఒడిశా పూరిలో సముద్రతీరాన ఇసుక తెన్నెలపై కేటీఆర్ దంపతుల చిత్రపటాలను చెక్కించారు. అద్భుతంగా ఉన్న ఈ బొమ్మలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేటీఆర్ దంపతులు మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు.