కూటమి పాలనలో ఉవ్వెత్తున సంక్షేమ విప్లవం

*ఐదు రోజుల ముందే వృద్ధుల ఇంటికి రేషన్ సరుకులు
*విభిన్న ప్రతిభావంతుల కళ్ళల్లో అనందం
*చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. నాదెండ్ల మనోహర్ లను ఆశీర్వదించిన వృద్దులు
*వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందించిన జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమి పాలనలో సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకి చెప్పని సంక్షేమాన్ని సైతం ప్రజలకందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అయన కొనియాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం శ్రీనివాసరావుతోటలో వృద్దులకు, విభిన్న ప్రతిభావంతులకు రేషన్ బియాన్ని, సరుకులను ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ తాము పడుతున్న కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఐదు రోజులు ముందుగానే ఇంటికి బియ్యం, సరుకులు అందించేలా ఏర్పాటు చేయటంపై వృద్దులు ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో సువరిపాలన సాగటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ లకు వృద్దులు ఆశీస్సులు అందచేసినట్లు ఆళ్ళ హరి తెలిపారు. కార్యక్రమంలో వడ్డే సుబ్బారావు, కలపాల శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment