బడి పెట్టారు సరే…జగనన్న విద్యా కానుక కిట్లు ఎప్పుడిస్తారు…?

  • ప్రైవేట్ పాఠాశాలల ఆగడాలపై చర్యలు తీసుకోండి.
  • జిల్లా విద్యాశాఖాధికారిని కోరిన పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు.

పార్వతీపురం, బడి పెట్టారు సరే…జగనన్న విద్యా కానుక ఎప్పుడు ఇస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం పార్వతీపురం జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరీస్, మానేపల్లి ప్రవీణ్, రాజాన పవన్ కుమార్ తదితరులు జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావును కలిసి జిల్లాలోని విద్యా వ్యవస్థ పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ లో పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు ప్రభుత్వ పాలన వైఫల్యంతో జూలైలో ప్రారంభమయ్యాయన్నారు. పోనీ పుస్తకాలు, బట్టలు, బ్యాగులు తదితర జగనన్న విద్యాకానుక ఎప్పుడు అందజేస్తారన్నారు.
జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల, ఉపాధ్యాయులు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అలాగే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు

  • పుస్తకాల సరఫరా జరిగిందా…?
  • యూనిఫాం కుట్టుకూలీ పేరెంట్స్ కి ఇచ్చారా…?
  • ఉపాధ్యాయుల, విద్యార్థుల రేషియో సరిపోయిందా…?
  • ఈ ఎడాదైనా మెరుగైన ఫలితాలు సాధిస్తారా…?
  • అలాగే స్కూల్ మ్యాపింగ్ లో ఇబ్బందులు ఉన్న పాఠశాలలకు మినహాయింపు ఇస్తారా…?
    తదితర వాటిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో ఫీజులు, మెటీరియల్ కొనుగోలుపై చేస్తున్న ఆగడాలను అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు మాట్లాడుతూ జిల్లాలో 1,03,883 మంది విద్యార్థులు న్నారన్నారు. పెదబొండపల్లిలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 20 మందికి అందజేశామన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలన్నారు. అప్పటిలోగా ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 20 మందికి చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, రేషన్లైజేషన్ తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారం నియాంకాలు జరుగుతాయన్నారు. అలాగే స్కూల్ మ్యాపింగ్ లో భాగంగా 129 స్కూలుకు మ్యాపింగ్ చేయడం జరిగిందని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మినహాయింపు ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే పుస్తకాలతో పాటు బ్యాగులు తదితరవి కిట్లు జిల్లాకు చేరుతున్నాయని వాటిని విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.