ఇండ్ల స్థలములకు సౌకర్యాలు ఏవి మూడు రోజుల పర్యటనలో మండిపడిన మాకినీడి

కాకినాడ జిల్లా, పిఠాపురం జనసేన గడప గడపకు కాదు మీరు ఇచ్చిన ఇంటి స్థలాలకు వచ్చి పరిశీలించండి, వాటిల్లోకి వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా లేవని, హైటెన్షన్ లైన్ల కింద గ్యాస్ పైప్ లైన్ పైన మీరు స్థలాలు ఇచ్చారు అంటే మీ ఉద్దేశం పిఠాపురాన్ని గ్యాస్ విస్పోటను చేసి మరో అమలాపురం చేయాలనా అని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి అధికార పార్టీ వైసిపి పై విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆమె నరసింగపురం, విరవాడ మరియు కొన్ని పిఠాపురం రూరల్ గ్రామాలకు ఇచ్చిన జగనన్న కాలనీలు, మూడున్నర సంవత్సరాల క్రితం నిర్మించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారుల సమస్యలు, ప్రభుత్వం చేసిన మోసాలు ప్రజలకు వివరించారు. ఇచ్చిన స్థలాల్లో లోపాలు, లబ్ధిదారులు సమస్యలు #జగనన్నమోసం అనే హష్ టాగ్ తో సోషల్ మీడియాలో సామాన్యుల గళం ప్రభుత్వానికి వినిపించేలా జనసేన తరఫున ఆమె లోపాలను ఎత్తి చూపారు. ఎమ్మెల్యే మీరు గడప గడపకు కాదు మీరు ఇచ్చిన జగనన్న కాలనీ గడపలు తొక్కి ఇక్కడ స్థలంలో లోపాలను, సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ఒట్టి పేపర్ల మీద స్థలం ఇచ్చామని చెప్పి దస్తావేజులు పంచడం కాదని వారికి కేటాయించిన స్థలాలను తక్షణమే లబ్ధిదారులకు చూపించి వారికి సొంత ఇంటి కలను నెరవేర్చినవారై ఈ ప్రభుత్వం మాట నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోపు సురేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాధి వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, బుర్ర సూరి ప్రకాష్, దేశినీడి సతీష్, రాసంశెట్టి కన్యాకరావు, యండ్రపు శీను, కంద సోమరాజు, టౌన్ నాయకులు సింగన్న, మణికంఠ, సాయిబాబు నామా, జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.