కాపుల అధికారం కోరుకోలేని నువ్వు ఏమి కాపు వాడివి.. జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ నేపధ్యంలో ముద్రగడ తీరుపై జనసేన జానీ మండిపడ్డారు. జానీ మాట్లాడుతూ.. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ కాపు ఉద్యమం చేశారు. ఈ క్రమంలో తునిలో ట్రైన్స్ కూడా తగలబడ్డాయి. అప్పుడు నిజం గానే కాపులు కోసమే ఆ ఉద్యమం చేసారు అని, కాపులతో పాటుగా దళితులు మిగతా జాతులు కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టారు అంటే అప్పుడు ఇప్పుడు ముద్రగడ వెనకాల రెడ్డిల పార్టీ వైస్సార్సీపీ వాళ్ళు వెనకాల ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి రెడ్డి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారూ.. అసలు మీరు ఎవరు?? మా జనసేనాని అనడానికి. అలానే మీరు వైస్సార్సీపీ పార్టీకి అమ్ముడుపోయి కాపు జాతిని తాకట్టు పెట్టడం ఒక దళితుడుగా నేను చింతిస్తున్నాను. కాపులు అధికారం కోరుకోలేని నువ్వు ఏమి కాపు వాడివి.. నువ్వు ఒక పాలేరు కాపు. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తికి అండగా ఉండాల్సింది పోయి.. అడ్డు తగలకు. వెంట పడి మరి నీకు బుద్ది చెబుతాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఐతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటుగా అన్ని కులాలను సమానంగా చూసుకుంటారు. జనసేన జానీ ముద్రగడపై తన ఆవేదన వ్యక్తం చేసారు.