కృష్ణాపురం జలాశయం ఆధునికీకరణకు విడుదలైన నిధులు ఏమయ్యాయి??

  • కుడి, ఎడమ కాలువలు ఎందుకు పూర్తి కాలేదు?
  • 18 సిస్టం ఛానెల్లు ఇంకా ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు?
  • 6125 ఎకరాల ఆయకట్టు వృధాయేనా?
  • 33 కోట్లు జైకా నిధులు ఏమయ్యాయి?
  • ఆధునికీకరణ ఎందుకు ఆపివేశారు?
  • గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించని ఉప ముఖ్యమంత్రి
  • నీ స్వార్థం కోసం, స్వలాభం కోసం, కమిషన్ల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలంలో మంగళవారం దాసరి నత్తం, కొత్తూరు రైతులతో జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణాపురం జలాశయం ఆధునికీకరణ గాలికి వదలి కుశస్థల నది సమీపానా కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి నోట ఇప్పుడు కొత్త రాగం వినపడుతుంది. తొమ్మిది గ్రామాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ 500 ఎకరాలు బలవంతంగా తీసుకొనే ప్రయత్నం జరుగుతుంది. చాలా చోట్ల ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వక రైతులు అగచాట్లు పడుతున్నారు. నానా కష్టాలు పడి కొంత భూమిని కలిగి ఉన్న రైతులు, కొన్ని గ్రామాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. అసలు కృష్ణాపురం జలాశయం ఆధునికీకరణకు విడుదలైన నిధులు ఏమయ్యాయి??. కుడి, ఎడమ కాలువలు ఎందుకు పూర్తి కాలేదు?. 18 సిస్టం ఛానెల్లు ఇంకా ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు?. 6125 ఎకరాల ఆయకట్టు వృధాయేనా?. 33 కోట్లు జైకా నిధులు ఏమయ్యాయి?. ఆధునికీకరణ ఎందుకు ఆపివేశారు?. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఏ విధంగా డ్యామ్ నిర్మాణం చేపడుతారు?. కనీసం గ్రామసభ కూడా జరగలేదు. అసలు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా?. జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మానవీయత కోణంలో ఆలోచించి కొత్త డ్యామ్ నిర్మాణాన్ని ఆపేయాలి. కృష్ణాపురం జలాశయాన్ని ఆధునికరించి, రైతులకు అందుబాటులో తీసుకురావాలి. తొమ్మిది గ్రామాల ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా జనసేన సిద్ధం అని యుగంధర్ పొన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చామంతి సురేష్, మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, ఎస్ఆర్ పురం మండల ఐటీ కోఆర్డినేటర్ మురుగేష్, మండల కార్యదర్శులు అజిత్, వడివేలు, శివ, మోహన్, జనసైనికులు, గ్రామస్తులు, రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.