‘వకీల్ సాబ్’ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుందంటే..?

దాదాపు మూడేళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులకు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ కు ఎప్పటిలాగానె  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో భారీ ప్రభంజనం సృష్టించిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా దీన్ని రూపొందించారు. అయితే పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలొ పెట్టుకుని కథలో కీలకమైన మార్పులు చేసినట్లు సమాచారం.   ‘పింక్’ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ హంగులను జోడించారు. అందులో ఫైట్స్ చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

‘వకీల్ సాబ్’లో మొత్తం ఐదు యాక్షన్ సీక్వెన్సెస్ ను జోడించినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో మూడు ఫైట్ సీక్వెన్సెస్, సెకండ్ హాఫ్ లో రెండు ఉంటాయని సమాచారం. ఈ ఫైట్లతోనే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఓ ఫైట్ లొ భాగంగా ఓ ఇంట్లో రౌడీ చేరి సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటాడట. ఈ క్రమంలో వివేకానందుడి ఫోటోని  విసిరేస్తున్నప్పుడు ఆ ఫోటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందని… ఆ చేయి పవన్ కళ్యాణ్ ది అని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలొ లో పవన్ కళ్యాణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని కుడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… నివేదా థామస్, అంజలి మరియు అనన్య లాంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.