కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న అనుచరుల దోపిడీ ఆగేది ఎన్నటికి??

కోవూరు నియోజకవర్గం: రాజుపాళెం, సర్వే నెంబరు 256 సీలింగ్ భూమి ప్రైవేటు వ్యక్తుల పరం ఎలా అయ్యాయని ప్రశ్నించి మూడు నెలలు అవుతున్న ఇంకనూ రెవెన్యూ వ్యవస్థ సరైన సమాచారం అందించ లేదు .. ఈ విషయంపై వీఆర్వో వచ్చి ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయో చూపిస్తున్నారు. కానీ గతంలో ఎమ్మార్వో ఇది ప్రభుత్వ స్థలము ఎవరికి ఇచ్చి ఉండలేదు అని ప్రకటించిన స్థలం ఏవిధంగా అన్యాక్రాంతం అయింది, అదేవిధంగా ప్రైవేటుపరమైనప్పుడు దీనిని 13 ఫైనాన్స్ నిధులతో 2 లక్షల రూపాయలతో ఏ విధంగా మట్టి పూడ్చారని అడిగితే ఇంక నువ్వు నీళ్లు నమ్ముతున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మరియు అతని అనుచరులైన పెత్తందారులు చేస్తున్న ఈ దోపిడీ ఆగేది ఎన్నటికీ.. నిజా నిజాలు తెలిసేది ఎన్నటికీ అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దెపూడి ప్రశ్నించారు.