ఎస్.కోట పంచాయతీ శివారు రేగపుణ్యగిరి గిరిజన గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ సేందేరి అర్జున్ అరటి గెలలు కోయడం సందర్భంగా కాలి జారిపడి కాలు పాక్చర్ అవడం జరిగింది. దీంతో గిరిజనులు డోలీపై మోసుకొని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజీవని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనను పరామర్శించడానికి వచ్చిన జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ… గిరిజనులు డోలీపై రోగులు, గర్భిణీ స్త్రీలను తరచూ మోసుకెళ్లడం వలన మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జనసేన నాయకుల విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ₹4 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేసి జనవరి 17న శంకుస్థాపన చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఇంజినీర్‌లు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అడవి క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పూర్తి కాలేదని సన్యాసి నాయుడు విమర్శించారు. ఇప్పటికైనా పనులను వేగవంతం చేసి గిరిజనులను ఈ సమస్య నుండి విముక్తి చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Share this content:
Post Comment