పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత నీకు ఎక్కడిది: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణం, స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు గురువారం జనసేన నేత వాసగిరి మణికంఠ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి జనసేన నేతలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజల తిరస్కారంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించని పులివెందల ఎమ్మెల్యే వైయస్ జగన్ తన అహంకారపూరితమైన మాటలతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత నీకెక్కడిది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జైలుకి బెయిల్ కి మధ్య ఊగిసలాడే వ్యక్తి, తల్లిని – చెల్లిని గౌరవించని అహంకారి, గత ఐదు సంవత్సరాల ఆయన నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడిన బుద్ధిరాని అహంకారి, గత పది సంవత్సరాలుగా తన అద్భుతమైనటువంటి పోరాటపటితో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజలని గౌరవిస్తూ తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారబోసి ప్రజాభిమానంతో భారతదేశంలోనే ఏ నేత కూడా సాధించని 100% స్ట్రైక్ రేట్ తో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను విమర్శించడం జగన్ అహంకారానికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో ఖండించారు, 15 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ప్రపంచ శ్రేణి నాయకుడు భరతజాతి ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ చేతనే ప్రత్యేక ప్రశంసలు అందుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్, కేవలం 9 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధికి, 13300 కు పైగా ఒకేరోజు నిర్వహించిన గ్రామసభలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోనే స్థానం సంపాదించి జాతీయస్థాయి నేతగా అనతి కాలంలోనే పేరు సంపాదించడాన్ని జీర్ణించుకోలేని పులివెందుల ఎమ్మెల్యే జగన్ మతి భ్రమించి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తారని, ఇకనైనా పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడాలని, లేకుంటే ఆ పదవికి రాజీనామా చేయాలని జనసేన నేతలు హితవు పలికారు. ఈ పాత్రికేయుల సమావేశంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన బాధ్యుడు వాసగిరి మణికంఠ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, వెంకటపతి నాయుడు, గోరంట్ల నాగయ్య రాయల్, మిద్దె ఓబులేసు, రామాంజనేయులు, హసన్, గుజిరి రామంజి, అమర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment