ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడ?: రియా

పాలకొల్లు నియోజకవర్గం: ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడ అని పాలకొల్లు నియోజకవర్గం జనసేన వీరమహిళ జుట్టుక ప్రియాంక (రియా) వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం రియా విలేకరులతో మాట్లాడుతూ ఆడ బిడ్డలకి ఎటువంటి అన్యాయం జరిగినా బుల్లెట్ కంటే వేగంగా జగనన్న వస్తాడు అని చెప్పిన మంత్రి రోజా ఎక్కడుంది. ప్రతిపక్షంలో ఆడవాళ్ళని చిన్న మాటంటేనే నోటీసులు పంపించే మహిళా కమిషనర్ అని చెప్పుకునే వాసిరెడ్డి పద్మ ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఎక్కడుంది. ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రి ఒకటి మూడు రెండు రేపులకేనా ఇంత అల్లకల్లోలం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అదే వాళ్ళ ఇంటి ఆడబిడ్డకి ఇలా జరిగి ఉంటే ఇలాంటి మాటలు వచ్చేవా? గత నాలుగు సంవత్సరాలుగా చిన్నపిల్లల దగ్గర నుండి యువతి లపై మహిళలపై వృద్దురాళ్ల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అత్యాచారాలు చేస్తున్న వాళ్లు బానే తిరిగేస్తున్నారు కానీ అన్యాయం జరిగిన కుటుంబానికి భరోసా ఎక్కడ? మా ఇంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగిందయ్యా న్యాయం జరిపించండి అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంటే రాజీ పడేలాగా చేస్తున్నారు ఇంకా ఆడపిల్లలకి భద్రత ఎక్కడ? అన్యాయం జరుగుతుంటే ఎవరికీ చెప్పుకోవాలి? ఇంకెన్నాళ్లు మా భద్రత కోసం పోరాడాలి.. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల అవుతున్నా కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం ఎక్కడ? అన్యాయం జరిగిన ఆడవాళ్ళకి న్యాయం జరిపించ లేనప్పుడు మీకు ఆ పదవులు ఎందుకు? అని రియా ప్రశ్నించారు.