జాబ్ క్యాలెండర్ ఎక్కడ..?: దోమకొండ అశోక్

విజయవాడ: 2023 జనవరి కూడా అయిపోయింది జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని జనసేన యువ నాయకులు దోమకొండ అశోక్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తుంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో అంత మెజారిటీ చట్టసభల్లో దక్కడంలో ఆ 30 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రధాన కారణమయ్యారు. ఎన్నికలకు ముందు 2లక్షల 30వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. యువతకు పట్టు బట్టలు, బంగారం కాదు, మంచి భవిషత్తు ఇవ్వండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించండి చాలు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. పెట్టుబడులు, పరిశ్రమలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు. వ్యవహరిస్తుంది. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అన్న వైసిపి, అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, నాలుగు జనవరిలు గడిచిన ఒక్కటైన నిరుద్యోగులకు ఉపయోగపడే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసిందా? డిగ్రీలు, ఎం.బీ.ఏ.లు పి.జీ.లు చేసిన యువత నోటిఫికేషన్ కోసం ఎదురుచూడటంలోనే పుణ్యకాలం పూర్తయిపోతుంది. స్వతంత్ర భారతంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తమదే అని ప్రగల్భాలు పలికిన వై.సి.పి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త జోష్యం చెబుతూ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తమ ఖాతాలోనే వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ వై.సీ.పీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో భారీగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ భారీగా ప్రకటన చేసింది .తీరా వాస్తవంలోకి వస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఇక స్వచ్ఛందసేవా కార్యక్రమం అని ప్రవేశపెట్టిన వాలంటర్ ఉద్యోగులకు నెలకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం కూడా చెల్లించలేకసేవా కార్యక్రమం పేరుతో తమ పార్టీ కార్యక్రమాలకు బానిసలు చేసింది. అర్హతకు తగిన ఉద్యోగం లేక స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్నా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్జీలకు సబ్సిడీ రుణాలు లేకుండా చేసింది. నిరుద్యోగుల ని కేవలం ఓటు బ్యాంకు లాగా మాత్రమే చూసే వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన తొందర్లోనే తిప్పి కొడుతుంది. ఉద్యోగాలు వస్తాయని యువత ఢిల్లీ, హైదరాబాద్, అవనిగడ్డ మొదలైన నగరాలకు వెళ్ళి కోచింగ్ తీసుకొంటున్నారు. వారందరి పరిస్థితి ఏమిటి? అని నిరుద్యోగ యువత తమ ఆవేదనను తెలియచేస్తున్నారు. తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు, కొత్తకొత్త పదవులు సృష్టించి ఉపాధి కల్పించిన వైసీపీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడం లేదు.. తమ పార్టీ వారిపై ఉన్న శ్రద్ధ, హామీ ఇచ్చిన 2.3 లక్షల ఉద్యోగాలపై ఎందుకు లేదని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి నిరుద్యోగ యువతకి జాబ్ కల్పిస్తాం. దేశానికి వెన్నెముక లాంటి యువతకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెన్ను దన్నుగా నిలుస్తారు. జనసేన పార్టీ ఆవిర్భవించింది యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికే అని దోమకొండ అశోక్ తెలియజేశారు.