భారతమాత బిడ్డలకు రక్షణ ఎక్కడ.?: తుమ్మి అప్పలరాజు దొర

విజయనగరం, మణిపూర్ ఘటన మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లో ఈ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ గంటన్నర పాటు వర్షంలో తడుస్తూ తుమ్మి అప్పలరాజు దొర ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ రాజ్యాంగం అమలు క్రమబద్ధీకరణ తప్పుతోంది. ఉదాహరణ మణిపూర్ రాష్ట్రంలో ఒకరి తారక చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసి మే 4న హత్య చేస్తే ఈనాటి వరకు వెలుగులోకి రాకపోవడానికి కారణం ఎవరిని ఎవరు కాపాడుతున్నట్టు? అక్కడ ఎవరిని అరెస్ట్ చేయకూడని కారణం చట్టం ఎవరికోసం పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే బడుగు బలహీన వర్గాలు పరిస్థితి ఏమిటి? మళ్లీ అంటరానితనం కులవృత్తి అంటూ కులాల మధ్య పోరు తప్పదు మధ్యప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గిరిజన యువకుల్ని చావబాది మూత్రం పోసి చిత్రహింసలకు గురిచేస్తే ఎవరు దీనిపై చర్యలు తీసుకునేవారు పోలీసు వారు ఆంధ్రప్రదేశ్లో 9 మంది యువకులు కలిసి నవీన్ అనే యువకుడిని చావబాది మూత్రం పోసి అతనను చిత్రహింసలకు గురి చేస్తే ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేయకుండా కేవలం ఆరుగురిని అరెస్ట్ చేసి ఆ ముగ్గురు కనబడలేదంటే అర్థం ఆ ముగ్గురు వెనకాతల ఎవరున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే భారతమాత కన్నీళ్లు గంగలా, గోదావరిలా ఉప్పొంగే సునామి తెప్పించే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన వ్యవస్థ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే మణిపూర్ ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులపై అత్యంత బాధాకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకొని అత్యాచారం చేసిన వారిని కఠినంగా ఉరితీయాలి లేనియెడల మా ఉద్యమం తీవ్రతరం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చందక పవన్, చరణ్, మహిళా నాయకురాలు తుమ్మి లక్ష్మిరాజ్, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.